శ్రీదీపిక

సోమవారం, అక్టోబర్ 13, 2014

 

Chandam API Example


మృగమదము తిలకమును నగు మొగముచెలువమును -నలఁతిపవడముఁ దెగడు నధరపుటము వలుదజఘనములు బొలుపలరుకనకపువలువ -కలితకరచరణమణికటకములును విరులతురుమును నమిలిపురిసొబగుమకరికము -రచన నెసఁగిన చెవుల రవణములును కరకమలయుగళ ధృతి మురళియును ద్రివిధమగు -నిలుకడయు నిటలతటి నెఱయు కురులు
ధీరశ్రేష్ఠుల్సన్నుతింపం గవీంద్రా
ధారంబై ధాత్రిన్మతాగాగణాప్తిన్
దోరంబై భూభృద్యతుల్ సంఘటింపన్
నీరేజాక్షా శాలినీవృత్త మొప్పున్.
పందికై పోరాడ ఫాలాక్షుఁ డెవ్వని; బలమున నా కిచ్చెఁ బాశుపతము?
నెవ్వని లావున నిమ్మేన దేవేంద్రు; పీఠార్థమున నుండ బెంపుఁ గంటిఁ?
గాలకేయ నివాత కవచాదిదైత్యులఁ; జంపితి నెవ్వని సంస్మరించి?
గోగ్రహణము నాఁడు కురుకులాంభోనిధిఁ; గడచితి నెవ్వని కరుణఁ జేసి?

శుక్రవారం, డిసెంబర్ 14, 2007

 

మొబైల్ బ్రౌజింగ్

నేను మొబైల్ బ్రౌజింగ్  మూడు సంవత్సరాల నుండీ చేస్తున్నా.నేను బ్రౌజింగ్ మొదలు పెట్టినప్పుడు తెలుగు ని సపోర్ట్ చేసే  మొబైల్స్ చాలా తక్కువ ఉండేవి/ అందుబాటు లో ఉండేవి కాదు.(విండోస్ మొబైల్స్  తప్పా వాటి ధర ౩౦ వేల కి తక్కువ ఉండేది కాదు.) అపట్లో మొబైల్ బ్రౌజింగు కూడా చాలా తలనొప్పి గా ఉండేది. మొబైల్ బ్రౌజర్స్  WAP  సపోర్ట్ మాత్రమే ఉండేది.ఇప్పటి బ్రౌజర్లు HTML/XHTML/WAP  ని కూడా చక్కగా హేండిల్   చేస్తున్నాయి. ఇది గతం.

మొబైల్స్ రేట్లు తగ్గీ,
యునీకోడ్ సపోర్ట్    వల్ల తెలుగు ని మొబైల్స్ లో చూడగలుగు తున్నాము.  తెలుగు లో వ్రాయగలుగు తున్నాము.  ఇప్పుడు SMS కి కూడా యునీకోడ్ సపోర్ట్     ఉండడం వల్ల తెలుగు లో కూడా పంపవచ్చు.  కానీ మీ మొబైల్ లో తెలుగు ఫాంటు ఉండాలి అంతే.

నేను రోజూ కూడలి ని మొబైల్ లో చదువుతాను.ఈనాడు,ఆంధ్రజ్యోతీ,దట్స్ తెలుగూ,యాహూ,రెడిఫ్  సైట్ల RSS  ఫీడ్లు తో వార్తలు అప్ డేట్ చేసుకుంటాను.
ఈ-మెయిలు చెక్ చేసుకోవడం , పంపడం లాంటి వన్నీ.

ఇక బ్లాగుల విషయానికి వస్తే   

GPRS   పట్ల అవేర్ నెస్   ఇంకా జనాలకి తెలియదు.
కొన్ని  బ్రౌజింగ్ టిప్స్
ఆపరేటర్ల గురించి
ఎయిర్ టెల్   లో  రెండు రకాల పధకాలు ఉన్నాయి

ఐడియా లో

హచ్,బీ.ఎస్ .ఎన్. ఎల్  లో నాకు తెలియదు.


ఇప్పుడు మొబైల్ బ్రౌజర్స్ లో ఒపేరా మినీ ని మించింది లేదు.(విండోస్ మొబైల్స్ ని మినహాయిస్తే. ఇది నా అనుభవం.) ఒపేరా మినీ లో జావాస్క్రిప్ట్ కూడా చక్కగా పని చేస్తుంది.(మొబైల్ లో జావా స్క్రిప్ట్ కి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.) లేఅవుట్,టేబుల్స్ ని చాలా చక్కగా చూపిస్తోంది.మొబైల్స్ కి ప్రిఫరబుల్ బ్రౌజర్.
(ఇది నా కామెంటు  ఇక్కడ http://praveengarlapati.blogspot.com/2007/09/blog-post_08.html)

కొసమెరుపు:
ఏది ఏమైనా  మొబైల్ బ్రౌజింగ్ కి కొంత ఓపిక కావాలి.



--
Dileep.M
E-mail:      m.dileep@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.
WebSite:   http://mdileep.googlepages.com
Blog:         http://mdileep.wordpress.com

బుధవారం, డిసెంబర్ 05, 2007

 

iTextSharp/ iTextSharp Hindi Problem Solved Here


Changes   in the  File ITextHandler.cs

  public override void Characters(string content, int start, int length)
{

       
         [...]
                           if (bf == null) {
BaseFont bfComic = BaseFont.CreateFont ("c://windows//Fonts//ARIALUNI.ttf",BaseFont.IDENTITY_H,BaseFont.EMBEDDED);
iTextSharp.text.Font font = new iTextSharp.text.Font(bfComic, 12);
currentChunk = new Chunk(buf.ToString(), font);
                }



      [...]

}


On   19th Jan 2006.        

--
Dileep.M
E-mail:       m.dileep@gmail.com ,
Phone:     +91- 9926 33 44 64.
WebSite:   http://mdileep.googlepages.com
Blog:         http://mdileep.wordpress.com




మంగళవారం, నవంబర్ 13, 2007

 

ధ్యానం —నా సందేహాలు

ధ్యానం —నా సందేహాలు
నేను ఈ మధ్య (జూలై నెల నాటి మాట) స్వామి వివేకానంద రాసిన రాజయోగం పుస్తకం చదివాను.ఇందు లో జ్ఞానం,దేవుడు,మతం,మత ప్రవక్తల గురించి,వారు జ్ఞానం పొందిన విధానం(రాజ యోగం) గురించి రాశారు. ఈ పుస్తకాన్ని చదివి అర్ధం చేసుకోవడానికి కొంచం కష్టపడ్డాను.అసలు విషయానికి వస్తే ఈ పుస్తకం చివరి అధ్యాయం లో చెప్పిన కొన్ని వాక్యాలు అమితం గా ఆకట్టు కున్నాయి.
అవి
[..] నిద్రించే ముందు వ్యక్తి ఏ స్థితి లో వుంటాడో, నిద్రించి మేల్కొన్న తర్వాత కూడా అదే స్థితి లో వుంటాడు.నిద్రించేవరకూ అతని కెంత జ్ఞానం ఉంటుందో నిద్ర తర్వాత కూడా అదే స్థితి లో ఉంటాడు.అతని జ్ఞానం ఏ మాత్రం వికసించదు. అతనికెట్టి తత్వదర్శనం కలుగదు. కానీ సమాధి ని పొందిన యోగి విషయం అలా కాదు. సమాధిలోకి వెళ్ళే ముందు అతను మూర్ఖుడై ఉంటే, సమాధి తర్వాత అతను ఋషి గా మారిపోతాడు[…]ఈ విషయం గురించి గాఢం గా అలోచించాను. సడన్ గా ఒక రాత్రి మూడింటి కి మెళుకువ వచ్చింది.సబ్ - కాన్షియస్ మైండ్ ని ఆక్టివేట్ చెయ్యడమే ధ్యాన స్థితి/సమాధి అన్న విషయం స్ఫురించింది. అంతే నిజంగా మొదటి సారి నేను చెప్పలేని ఆనందాన్ని పొందాను.ఆ ఆనందాన్ని ఇప్పుడు మాటల లో చెప్పలేను. ఇప్పుడు పై విషయం కూడా నా సబ్ కాన్షియస్ మైండే చెప్పింది అన్న విషయం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకు ముందు ఒక పుస్తకం లో(పేరు గుర్తు లేదు. ఇంగ్లీషు పుస్తకం అది.) సబ్ -కాన్షియస్ మైండ్ ని ఎలా ఏక్టివేట్ చేసుకొవాలి అన్న విషయం చెప్పారు. అప్పటి నుండీ సమస్యలకు పరిష్కారా లు నిద్ర లో పొందాను.

తర్వాతి రోజు నుండీ ఈ విషయం గురించి ఆలోచించిన తర్వాత నాకు వచ్చిన సందేహాలు ఇవి.
1.నిజంగానే సబ్ కాన్షియస్ మైండ్ ని ఆక్టివేట్ చేయడమేనా ధ్యాన స్థితి / సమాధి స్థితి అంటే??
2.ధ్యాన/సమాధి స్థితి ని పొందే మార్గ్రం ఇదేనా? (రెండిటి మధ్యా చాలా బేధం ఉండవచ్చ్చు.)
3.లేదా నేను సరిగ్గా అర్ధం చేసుకోలేదా??

కొంత మందిని ఇదే విషయం అడిగాను. సరైన సమాధానం దొరక లేదు. ఒకాయన సబ్ - కాన్షియస్ మైండ్ నుండీ పొందే పరిష్కారాలు మాత్రం గొప్పగా వుంటాయి అని.
ఇదే పుస్తకం లో స్వామి చెప్పిన మరికొన్ని వాక్యాలు

[..] ప్రపంచం లో ని గొప్ప ప్రవక్తలంతా "మాకు లభించిన తత్వసిధ్ధాంతాలన్నీ పైనించే వచ్చాయి." అని వారంతా అంటారు.అయితే అవి వారికి నిజం గా ఎక్కడి నుండీ ప్రాపించాయో ,వారి లో చాలా మంది కి తెలియదు.(రెక్కలతో ఎగిరి వచ్చిన దేవదూత లేదా దేవత చెప్పిందని వారు అన వచ్చు.) హేతు ప్రజ్ఞ తో గానీ,తర్కం తో గానీ తమకీ దివ్యజ్ఞానం కలుగలేదని వీరంతా ఏకీభవించవచ్చు గాక.
"వారికి ప్రాప్తించిన దివ్య జ్ఞానం హేతువాదానికి అతీతమే, అయితే ఈ జ్ఞానం అంతర్గతం నుండే వస్తున్నది." -యోగశాస్త్రం. [..]
[..]అతీంద్ర్రీయ జ్ఞానాన్ని సాధించడమే మతం.[..]
[..]ఒక పుస్తకం లొ బ్రహ్మజ్ఞానమంతా ఉందనటం,ఈశ్వరుడిని నిందించడమే!భగవంతుడు అప్రమేయుడు,అనంతుడు అంటూనే, అతన్ని ఒక చిన్న పుస్తకం లో ఇరికించడం ఎంత అవివేకం![..]
[..]వెలుపల లేదా లోపల ఒక లక్ష్యం మీద మనసును నిలిపితే,చిత్తం ఆ లక్ష్యం లో అవిచ్చన్నంగా ఉండిపోతుంది.దీన్నే ధ్యానం అంటాం. ప్రతీదీ లేదా ఇంద్రియానుభవం లోని బాహ్యాంశాన్ని తొలగించి,అంతరాంశమైన అర్ధాన్ని మాత్రమే ధ్యానించగలిగే తీవ్ర శక్తి మనసుకు ఏర్పడితే అది సమాధి అవుతుంది.[..](ఇది సరిగ్గా అర్ధం కాలేదు.)
[..]సమాధి ని పొంధాలంటే శాస్త్రీయంగా సాధన చేయాలి.[..]

రిఫరెన్సులు:
1.రాజ యోగం-స్వామి వివేకానంద(ISBN 81-7120-744-8)
https://www.sriramakrishnamath.org/ వెబ్ సైట్ ద్వారా కూడా ఆర్డరు చేయవచ్చు.

వెల:Rs.15/- మాత్రమే.(మార్చి 2007 నాటికి)
2.Unknown Book
3.My Personal Experiences.

నా సందేహాల కు సమధానాలు దొరుకుతాయని ఆశిస్తూ
దిలీపు మిరియాల



--
Dileep.M
E-mail:      m.dileep@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.
WebSite:   http://mdileep.googlepages.com
Blog:         http://mdileep.wordpress.com

సోమవారం, సెప్టెంబర్ 10, 2007

 

ఫ్లాష్ పేపర్


ఇది తరువాతి తరం వెబ్/డెస్క్ టాప్  పేపరు.ఇప్పుడు పీడీఎఫ్ మరియూ ఫ్లాష్ లు  ఎంత పాపులర్ / భాగం  అయ్యాయో దీనికి కూడా అంత సత్తా వుంది. నిజం చెప్పాలంటే ఇది పీడీఎఫ్  మరియూ ఫ్లాష్ ల మేలు కలయిక(hybrid Technology  of Flash and Pdf). ఇది హైబ్రీడ్ టెక్నాలజీ కావడం వల్ల పీడీఎఫ్, ఫ్లాష్  కి ఉన్న ఉపయోగాలు రెండూ ఉన్నాయి. డాక్యుమెంట్లు చదువు కోవడం, ప్రింటు తీసు కోవడం,ఫుల్ స్క్రీన్ , డాక్యుమెంట్లు Embed/షేరింగ్ చేసుకోవడం వంటి అన్ని ఆప్షన్లూ  ఉన్నాయి.
ఫైల్ Extension: .swf
ఇప్పుడు ఎవరు ఎవరు  ఈ ఫ్లాష్ పేపర్ల ని అందిస్తున్నారు/ఉపయోగిస్తున్నారు:

Scribd.com గురుంచి కొంత
ఈ సైట్ లో ఆన్ లైన్ లో ఫ్లాష్ పేపర్లు తయారు చేసుకోవచ్చు. మన వధ్ధ ఉన్నా .pdf, .doc, .ppt, .xls, .txt, .odt, .odp ఫైల్స్ ను ఫ్లాష్ పేపర్ల లా మార్చుకోవచ్చు. ఒక ఫార్మేట్ లో ఉన్న డాక్యుమెంటుని మరో ఫార్మేట్ లో కి మార్చుకోవచ్చు. ఇంకా .mp3  గా వినవచ్చు(ఈ టెక్నాలజీ  Adobe Pdf Reader 6.0  నుండీ ఉన్నదే). అడోబ్ ఒక ప్లగ్ ఇన్ అందిస్తోంది. దానితో  .doc లను ఫ్లాష్ పేపర్ల గా మార్చుకోవచ్చు.

References:
Scribd.com వెనుక  కధ - http://www.scribd.com/faq#faq_question_7
Flash Paper2.0 http://www.adobe.com/products/flashpaper/
Download         http://www.adobe.com/go/flashpaper2_trial
Scribd RSS      http://www.scribd.com/feeds/popular
Google Books   http://books.google.com
--
Key Words: Scribd,Google Books, Flash Paper,Pdf Alternative,Flash(.swf)
--
 ఇది రిలీజ్ అయ్యి అప్పుడే ఆరు నెలలు దాటింది.
  
--
Dileep.M
E-mail:       m.dileep@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.
WebSite:   http://mdileep.googlepages.com
Blog:         http://mdileep.blogspot.com

శనివారం, సెప్టెంబర్ 01, 2007

 

Bookmarks

AJAX RSS READER
ASP ALLIANCE
ASP Classes
ASP Real World
ASP RealWorld
ASP Rich Components
Brinkster.net
ClustrMaps - Admin
Daily Image
Developer
DHTML
Dileep's Homepage(FreeWeb)
Dileep's HomePage(Google)
Dileep's Live Space
DotNet API
DotNetBips.com :: The .NET Knowledge Base
Effective ToolBar
Employees.org
Feed Burner
Fickr
FileFormat
Flash RSS Reader
FontForge
Free Web Hosting Guide
FreeDNS - Free DNS - Dynamic DNS - Static DNS s...
FreeSoft
Freshmeat.net
Google Custom Search
Google Web Toolkit - Build AJAX apps in the Jav...
Great Andhra
Guruji
Image Processing Lab
Indian Railways Online Passenger Reservation Site Providing ...
JAva Scripts
JavScript
LiveJournal
More BookMarks
MSDN Connection
MSDN JavaScript
Online PDF Reader
PC World - The 100 Best Products of 2005
Photos
Planet
Port 25
ProseTech.com
RapidShare
ReadHTML
REGex TESTER v1.5.1 - test/validate regular exp...
Regular Expression Library
Sanp
SaveFile
Site Point
Telugu Type Pad - Vishal Monpara
Templete Help
TutorialIndex
UpLoad Anything
Upload multiple files using the HtmlInputFile c...
Walkin
WebReference
Welcome to employees.org — Employees.org
Windows XP Validator Cracker
Windows Live
XML
Yahoo! Telugu
ఈ వార్త
ఈమాట గ్రంధాలయం(EEMaata Library)
తెలుగు Dictionary
తెలుగు MSN
తెలుగు OneIndia
తెలుగు జర్నల్
తెలుగు ఫాంట్లు(Telugu Fonts)
తేనెగూడు
నా మదిలో ...: వెబ్ హోస్టింగ్, సాఫ్ట్ వేర్లు, వగ...
నీతి కధలు
ప్రజాకళ
భక్తి(Bhakthi)
మాగంటి వారి ఇల్లు
వెబ్ ప్రపంచం


--
Dileep.M
E-mail:       m.dileep@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.
WebSite:   http://mdileep.googlepages.com
Blog:         http://mdileep.blogspot.com

శుక్రవారం, ఆగస్టు 24, 2007

 

గూగుల్ ఇండిక్ ట్రాన్స్ లేటర్


Google వాడు  Indic Translation  మొదలు పెట్టాడు. దీనితో వెబ్ ఆధారితమైన మరో భారతీయ భాషలు వ్రాసే పరికరం  లభించింది అన్నమాట. (ప్రస్తుతం హిందీ మాత్రమే . తెలుగు / ఇతర భాషలకు మాత్రం On-Screen Keyboard లభిస్తోంది.)
తెలుగు బ్లాగర్ల కు ఇది ఏమి గొప్ప విషయం కాదు కానీ దీని వల్ల తెలుగు/భారతీయ భాషలు రాసే వాళ్ళు పెరగవచ్చు. అన్ని పెద్ద పెద్ద సైట్లు Globalisation నుండీ
Localisation వైపు పరిగెడుతున్నాయి. మార్కెట్ పెంచుకోవడానికి/ సామాన్య ప్రజలకు టెక్నాలజీ ఫలాలు అందడానికి ఇవి అన్ని తప్పవు. ఇంకా తెలుగు/భారతీయ భాషలు కంప్యూటర్ లో చూడవచ్చు/రాయవచ్చు అని తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది వున్నారు. తెలిసిన వాళ్ళు ఇంకా కూడలి లేదా వెబ్ ఆధారిత మరి  ఇతర మాధ్యమాలు   వాడడం నాకు ఆశ్చర్యం కలిగించే విషయం.  మనం తెలుగు/భారతీయ భాషలు రాయడానికి ఇంగ్లీషు మీద ఆధారపడడం నిజం గా నాకు ఆశ్చర్యం కలిగించే మరో విషయం.
References:

Google Labs http://labs.google.co.in/
Indic On-Screen Keyboard iGoogle Gadgets http://labs.google.co.in/indic.html
Google Indic Transliteration http://www.google.com/transliterate/indic/
Dileep Telugu Translator http://www.google.com/ig/directory?num=24&url=http://mdileep.googlepages.com/telugu1.xml

-------


మైక్రోసాఫ్ట్ కూడా తెలుగు/భారతీయ భాషలు కోసం చాలా కృషి చేస్తోంది.
MicroSoft KeyBoard Layout Creator 1.4 రిలీజ్ అయ్యింది . చూడండి . ఇందులో మనకు నచ్చిన విధంగా కీ బోర్డ్ డిజైన్ చేసుకోవచ్చు. http://www.microsoft.com/globaldev/tools/msklc.mspx
ఇది నేను చేసినది (పూర్తి చేయనిది.) http://mdileep.googlepages.com/wx.zip
http://mdileep.googlepages.com/wx.klc కూడా చూడ వచ్చు.

--
Dileep.M
E-mail:      m.dileep@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.
WebSite:   http://mdileep.googlepages.com
Blog:         http://mdileep.blogspot.com



 

Flickr కొత్త ఫైల్స్ అప్ లోడర్ -Review


నిన్న Flickr లో నా 15Aug టూర్ ఫొటోలు అప్ లోడ్ చేస్తుండగా  ఒక కొత్త ఫీచర్ గమనించాను.  అది ఒకే సారి బోలెడు ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతే కాదు వాటి అప్ లోడ్ స్టేటస్ కూడా కనిపిస్తోంది. ఇది నిజం గా  గొప్ప విషయం ఎందుకంటే ఇప్పటి వరకు  మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేసేందుకు Control లేదు(Desktop Applications  లో మాత్రమే FilesList Control ని Acess చెయ్యవచ్చు.) .  దీని మీద ఒక గంట గూగులింగు & Reserve Engineering టెక్నిక్స్  వుపయోగించిన తరువాత తెలిసిన/అర్ధమైన   విషయాలు ఇవి:
వుపయోగించిన Technologies : Flash,JavaScript,Ajax.
౧.ఫ్లాష్ తో FileList Control Acess చేయవచ్చు కాబట్టి దానిని వుపయోగించి Multiple Files Selection సాధ్యం అయ్యేలా చేశారు.
౨.ఒక సారి ఫైల్స్ కి రిఫరెన్స్ దొరికిన తరువాత ఇంకే ముంది  ఏమైనా చేయవచ్చు. అలా Status bar Ajax తో తయారు చేశారు.
౩. ఒక వేళ JavaScript లేక పోతే  (ఆఫ్ చేసి వున్నా)  బేసిక్ ఫైల్ అప్ లోడర్ కి రీడైరక్ట్ అయ్యిపోతుంది.(ఇది Hyper Link మాత్రమే) .కాని JavaScript వుంటే మనకు కనిపించే లింక్ వర్క్ కాకుండా FileList Control open అవుతుంది.(ఇది ఆ hyper link path dynamic గా change చెయ్యడం వల్ల సాధ్యం అయ్యింది. )
౪. మరో గొప్ప విషయం ఏమిటంటే దీనికి అంతటికి కారణ మైన Flash Object కనిపించదు. (http://flickr.com/images/upload/yuploadcomponent.swf )
కాబట్టి ఇక ముందు అన్ని సైట్ల లోను మల్టిపుల్ ఫైల్ సెలక్షన్ చూస్తాం . అలా Yahoo(Flickr) మరో శకానికి తెరతీసింది. మీ అభిప్రాయాలు తెలియ  చేయగలరు.
References:
1.http://www.devpro.it/FileReference/
2..http://flickr.com/photos/upload/
3.http://ajaxian.com/archives/flickrs-new-file-uploader

--
Dileep.M
E-mail:       m.dileep@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.
WebSite:   http://mdileep.googlepages.com
Blog:         http://mdileep.blogspot.com



ఆర్కైవ్‌లు

జులై 2007   ఆగస్టు 2007   సెప్టెంబర్ 2007   నవంబర్ 2007   డిసెంబర్ 2007   అక్టోబర్ 2014  

This page is powered by Blogger. Isn't yours?

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి పోస్ట్‌లు [Atom]


Visitors